పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, కొయ్యలగూడెం మండలాలున్నాయి.
ఇది జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన ఏకైక నియోజకవర్గం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కారణం అక్కడ కడుతున్న ప్రాజెక్టే.. అయితే 2014లో తెలుగుదేశం పార్టీతరపున ఈనియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ముడియం శ్రీనివాసరావు పనితీరు ఏమాత్రం బాగోలేదనే విమర్శలు నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది. అసలు మా ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసులకు నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదు చేయడానికి సైతం చాలాసార్లు సిద్ధమయ్యారు. గెలిచిననాటినుంచీ ఎమ్మెల్యే అందుబాటులో లేరని ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు వారి బంధువులు చెబుతున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఆయన, ఆయనతోపాటు అనుచరులు కేవలం పైరవీలకే పరిమితమవుతున్నారట. ప్రతీపనికీ రేటును నిర్ణయిస్తూ బాగావసూలు చేసుకున్నారట.. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా స్థానిక నేతలు స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. అధికారుల వద్ద పనులు చేయించుకుని డబ్బులు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. నెలకు పట్టుమని 10రోజులు కూడా ముడియం నియోజకవర్గంలో ఉండరని పని ఉంటేనే జిల్లా కేంద్రం ఏలూరుకు వచ్చి అధికారులను కలిసి మళ్లీ హైదరాబాద్ వస్తారు. ఎమ్మెల్యే ముడియం ఎక్కడఉన్నారని అడిగితే మాఎమ్మెల్యేతో ఏంపని మీకు.. పనికావాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.. అని ఆయన అనుచరులు డైరెక్టుగానే చెబుతున్నారట. మన్యంలోని చాలాప్రాంతాలకు విద్య, వైద్యం తాగునీరు వంటి హామీలిచ్చినా అవి నెరవేర్చలేదట.. పార్టీ కార్య్రమాలు నిర్వహించడం తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదట.. అయితే ముందునుంచీ ఈ ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 2004 18,500 మెజారిటితో 2009 సార్వత్రిక ఎన్నికలలో 5800 మెజారిటితో మాజీ ఎమ్మెల్యే అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు గెలుపొందారు. అనంతరం వైసీపీలో చేరగా జగన్ రాజీనామా చేయాలని ఆదేశించడంతో అనివార్యమైన 2011 ఉపఎన్నికలో వైసిపి అభ్యర్థిగా తెల్లం బాలరాజు 36,500 భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇది జిల్లాలోనే అత్యధిక రికార్డు మెజారిటి.. అనంతరం 2014లో టీడీపీ గెలుపొందింది. అయితే ఇప్పటికీ వైసీపీకి బలమైన క్యాడర్, టిడిపి కి దీటైన కార్యకర్తలు ఉన్నారు. 2014లో రైతులు, బీసీలు, గిరిజనులు కాపు సామాజిక వర్గ ప్రజలు టిడిపి ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాల మాఫి, కాపు రిజర్వేషన్ల ఎరతో టీడీపీ గెలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో 2019లో వైసీపీ సునాయాసంగా గెలుస్తుందట.. ముఖ్యంగా రైతులు, మహిళలు, కాపులు టిడిపి పాలనపై ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా పట్టిసీమలో అవినీతిని ఈ ప్రాంతవాసులు కళ్లారా చూడడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర దుష్ప్రభావం చూపనున్నట్టు స్పష్టమవుతోంది. జనసేన పార్టీ పోలవరంపై కాస్తో కూస్తో ప్రభావం చూపినా గెలుపు నిర్ణయించే స్థాయిలో ఆ ప్రభావం ఉండబోదని స్పష్టమవుతోంది. ఈ సమీకరణాలతో పోలవరం మరోసారి వైసీపీ కైవసం కానుందని తెలుస్తోంది.