మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశాయని అన్నారు.ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చినప్పుడే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని సుమన్ చెప్పారు.దళితుల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని అన్నారు.ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి అని సుమన్ చెప్పారు..