కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ చేయకూడని పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. శాండిల్వుడ్తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిధి చిక్కుల్లో పడింది. మైసూర్ ప్యాలెస్లో ఆమె తీసుకున్న ఫోటోలే అందుకు కారణమయ్యాయి. అయితే, మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు తీయడం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు దిగడమే కాకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమెపై నెటిజన్లు సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అందరూ అనుకున్నట్టు తాను మైసూర్ ప్యాలెస్లో ఫోటో షూట్ చేయలేదని, అందరూ టూరిస్టుల మాదిరిగానే ఫోటో తీసుకున్నానని చెబుతోంది హీరోయిన్ నిధి. మరో వైపు ప్యాలెస్లో ఫోటోలు తీసుకోవడంపై నిషేధం లేదని, దసరా, నవరాత్రుల సమయంలో మాత్రమే ఫోటోలపై నిషేధం విధిస్తామని అక్కడి భద్రతా అధికారులు చెబుతున్నారు.