తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు.లీలమ్మ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు.