టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. యూ అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి గెస్ట్ హాజరై సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ రష్మి అందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ‘అంతకుమించి’ ట్రైలర్ చూశాను. అందులో నాకు బాగా నచ్చింది రొమాంటిక్ షాట్స్. అవంటే నాకు చాలా ఇష్టం. గతంలో మేము ఫిలింనగర్ ఛాంబర్ దగ్గర ‘ఆర్ఎక్స్ 100′ హోర్డింగ్ వేశాం. మా హోర్డింగ్ పక్కన చాలా రోజులు ఏ హోర్డింగ్స్ పెట్టలేదు. సడెన్‌గా ఒక హోర్డింగ్ వచ్చింది. రష్మిగారి తొడలు, సముద్రం బీచ్‌తో కూడి ఆ హోర్డింగ్ చూస్తే నా సినిమా హోర్డింగ్ గురించి మరిచిపోయాను. ఇది నేను ఒక ఆడియన్‌గా చెబుతున్నాను. రేపు మీరు కూడా నాలాగే కనెక్ట్ అవుతారు…. అంటూ అజయ్ భూపతి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
