వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో మాట్లాడారు. అయితే ఈ ఫొటోపై ప్రత్యర్ధ పార్టీలు విచక్షణారాహిత్యంగా కామెంట్స్ చేసాయి. జనసేన పార్టీ మహిళా నాయకులు సైతం జగన్ ముద్దుపెట్టేందుకు ప్రయత్నించగా ఆ విద్యార్థిని చున్నీ అడ్డుపెట్టిందంటూ చేసిన వెకిలివ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టీడీపీ కూడా నెటిజన్లు ఈ ఫొటోలపై తప్పుడు వ్యాఖ్యలు చేసారు. రాజకీయ పార్టీల్లో చురుగ్గా పనిచేస్తున్న మహిళా నాయకులు కూడా హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈఫొటోపై వచ్చిన దుమారం చినికి చినికి గాలివానలా మారింది. ఓ ఇద్దరు వైసీపీ సీనియర్ నాయకులు ఈ అంశంపై మాట్లాడుకుంటుండగా.. ఇటువంటి పోస్టులు పార్టీకి నష్టం కలిగిస్తాయా.? జగన్ మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిస్తే బాధ పడతారా.? జగనన్న వద్దకు వచ్చే మహిళలను, యువతులను మనం కట్టడి చేయలేం కదా.? ఓట్లపై ప్రభావముంటుందా.? అని అడిగితే.. వీటికి బదులు మరో సీనియర్ నేత ఇలా అన్నారట.. ఇలాంటి విషయాలు జగనన్నకు తెలిసినపుడు ఆయన ఒకే మాట అంటారు.. “అన్నా.. మీరింకా పార్టీ, ఓట్లు, రాజకీయాలు అని మాట్లాడుతున్నారు.. నేను నా చెల్లెలు (పై ఫొటోలోని యువతి) ఇటువంటివి చూస్తే ఎంత బాధపడుతుందోనని నా మనసుకు బాధగా ఉంది.. అంతే తప్ప మరోటి, మరోటి నేను ఆలోచించను అంటారు..” అన్నారట.. అంటే ఆయన ప్రజలగురించే ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ ని పట్టించుకోరు.. రాజకీయాలకు అస్సలు భయపడరు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగనన్న ప్రజలను వదల్లేదు అన్నారట.. గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్ననేతలు, ముఖ్యంగా మహిళలు ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.