ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు ఎక్కువ నిధులు కేటాయిస్తాను అని హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే .
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత జగన్ కు మద్దతుగా నిలిచారు .ఇటీవల వరస వివాదాలతో టీడీపీ నుండి బయటకొచ్చిన మోత్కుపల్లి నరసింహులు జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని జగన్ చెబితే దానిపై కూడా దుష్ప్రచారం చేశారని అన్నారు.జగన్ అన్నదానిలో తప్పు ఏమి ఉందని ఆయన అన్నారు.వాస్తవ పరిస్థితిని జగన్ చెప్పారని మోత్కుపల్లి అన్నారు ..