ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు.
ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, మెరుగైన జీవన విధానం కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం లో బాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎన్నారై టి. ఆర్. యస్ యూకే, తెలంగాణ జాగృతి యూకే & యూరోప్, టి. డీ. ఎఫ్ యూకే & యూరోప్ మరియు టాక్ సంస్థల ప్రతినిధులతో పాటు స్థానిక తెలంగాణ వాదులు పాల్గొన్నారు.