2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..?
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రజలతో ఆటలాడి నమ్మకద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోయిన తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నమ్మిన ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహానికి తెలుగుదేశం పార్టీ తగిన ఫలితం అనుభవించబోతోంది. ఇది మాత్రం పక్కా అని సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్ ద్వయానికి కూడా తేటతెల్లమైంది. రాష్ట్రంలో 2019లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమకు 40 ఎమ్మెల్యే సీట్లు కూడా రావడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు. 2014లో సాధించినన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని తాము కలలలో కూడా ఊహించడం లేదని ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలే కుండబద్దలు కొడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ దఫా అందులో సగం వచ్చినా అది గొప్పేనని మరికొందరు టీడీపీ నేతలు అంటున్నారు.
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ విజయ అవకాశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో నిరాశలో మునిగిపోయారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీనే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాజాగా లోకేష్ వేసుకుంటున్న సెల్ప్‌గోల్స్ కూడా టీడీపీకి శాపంగా పరిణమించాయి. ఇటీవల నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలోని ఒక ప్రధానమైన వర్గం టీడీపీకి పూర్తిగా దూరమవుతుందని నిఘా వర్గాలు టీడీపీ అధిష్టానానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతోనే వైసీపీ విజయావకాశాలు పెరిగినట్టు వారు భావిస్తున్నారు.