ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు.
ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు వైసీపీలో చేరడం ఖాయమైంది..ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర పేరిట తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి కలిసి దాదాపు ఆరగంటపాటు జగన్ తో చర్చలు జరిపారు.
అనంతరం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఒక మంచి రోజు చూసుకోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ కండువా కప్పుకోవాలని రాంకుమార్ రెడ్డి ఆలోచిస్తున్నాట్లు అనుచరవర్గం అంటున్నారు..