ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ .
ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బరిలోకి దిగాలి. అప్పుడే జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోకి వస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ నాయుడు కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల ప్రకటనతో టీజీ వర్గం ఆత్మరక్షణలో పడిన సంగతి విధితమే..