తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.
1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన జనాభాకు తగ్గట్టుగా మనకు కావలసినంత మంది నర్సస్ లేరు..ఉన్నవారిలో ఎంత మంది నర్సస్ పనిచేస్తున్నారో తెలియదు..మనకంటూ ఒక్క డేటా లేదు.. అందుకే నర్సస్ రిజిస్ట్రేషన్ నంబర్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నాం. ఈ ప్రక్రియ వలన ఎంత మంది నర్సస్ మనదేశంలో పనిచేస్తున్నారో తెలుసిపోతుంది.వారి ఏ వైద్యశాలలో పనిచేస్తున్నారో తెలిసిపోతోంది.ఎంత మంది విదేశాలలో పనిచేస్తున్నారో తెలిసిపోతుంది..దీనివలన అర్హత లేని వారు వైద్యశాలలో పనిచేయకుండా నివారించవచ్చు దీనివలన రోగికి మెరుగైన వైద్యం నిపుణులైన నర్సస్ సే అందించగలరు..అని ఆయన చెప్పారు.ఆధార్ కార్డుతో నర్సెస్ అనుసంధానం ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగంగా సాగుతున్నది అని ఆయన అన్నారు..రాబోయే నెలలో తెలంగాణ రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అని ఆయన అన్నారు..
మీ పక్క రాష్ట్రం అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నర్సింగ్ ప్రాక్టీశనర్ కోర్స్ ను అమలు చేయడానికి అంగీకారం తెలిపారు..కానీ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు పై కోర్స్ ను అమలు చేయుటకు అంగీకారం తెలపడం లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో పై కోర్సు ఆలస్యం అవుతుంది.. అని ఆయన చెప్పారు.. దీనిపై తాను త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు అధికారులతో సమావేశం అవుతానని చెప్పారు. అదే విధంగా కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసుకోవాలి అని అయనఅన్నారు… నర్సింగ్ డైరెక్టరేట్ ఉంటేనే నర్సింగ్ వ్యవస్థలో మార్పులు చూడగలం.. తప్ప ఇంకా ఈ ముసదొరాణితి తో ముందుకు సాగలేము..నర్సింగ్ కానీ వారు అధికారులుగా ఉండడటం వలన సమస్యను అర్థం చేసుకోవడం జఠిలం అవుతుంది… అందుకే నర్సింగ్ వ్యవస్థకు ఆదరణ కొరవడింది..ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నర్సింగ్ వ్యవస్ధ కోసం సపరేటు బడ్జెట్ అంటూ కేటాయించడం లేదు..1994లో కేంద్ర ప్రభుత్వం నర్సింగ్ వ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్ కేవలం 40 లక్షలు మాత్రమే.. ఈ 40 లక్షలతో ఎలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం చేయగలం.. 11 వ పంచవర్ష ప్రణాళికలో 80 కోట్లు భారత ప్రభుత్వం నర్సింగ్ వ్యవస్థకు కేయయించడం జరిగింది..ప్రస్తుతం 3 వేల కోట్లు భారత ప్రభుత్వం కేటాయించడం జరిగింది.. దినితోనే దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆధార్ కార్డ్ తో నర్సింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతుంది..అలాగే 2030 కల దేశం మొత్తములో B.sc నర్సింగ్ ఉంటుంది .GNM డిప్లొమా నర్సింగ్ కోర్సు స్కూల్స్ అని 2022 కల నర్సింగ్ కళాశాలగా అప్గ్రేడ్ అవుతాయి అని ఆయన అన్నారు..
నర్సింగ్ విద్యాలో మార్పు:
నర్సింగ్ విద్యాలో మార్పు ప్రక్రియ లో భాగంగా నర్సింగ్ నిపుణులు కొత్త పుస్తకాల రచనలు ( పునర్ ముద్రణ) మొదలుపెట్టారు..అందులో అనేక మార్పులు చేస్తున్నారు కొత్త పాఠ్యఅంశాలను అందులో జోడిస్తున్నారు..ఈ ప్రక్రియ మొదలైంది.. దీనివలన నాణ్యమైన నర్సింగ్ విద్యను విద్యార్థులకు అందించగలము అనే ఆశాభావం ను ఆయన వ్యక్తం చేశారు.అలాగే వైద్యశాలలో పనిచేస్తున్నవారి కోసం “నిరంతర నర్సింగ్ విద్యా” “CONTINUATION NURSING EDUCATION”(CNE) అనే కార్యక్రమం ఈపాటికే మొదలైంది చాలా రాష్ట్రాలలో ఇది కొనసాగుతుంది.. ఏదైనా ఇక వైద్యశాల వారు సదరు కార్యక్రమం నిర్వహించినప్పుడు ..హాజరు అయినా వారికి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ క్రెడిట్ అవర్స్ కింద మార్కులు కేటయిస్తుంది. ఈ మార్కులు నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యూవల్ అప్పుడు చూస్తారు అని ఆయన అన్నారు.జపాగో వారితో ఒప్పంద చేసుకున్నాము.. వారి మనకు నర్సింగ్ విద్యాలో మెళుకువలు నేర్పిస్తారు అని ఆయన అన్నారు. 25 వేల మంది నర్సస్ మీడీల్ ఈస్ట్ దేశాలలో పనిచేస్తున్నారు.
జాతీయస్థాయిలో నర్సింగ్ లైసెన్సి పరీక్షలు రాబోయే రోజుల్లో నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.. పార్లమెంటులో త్వరలోనే నర్సింగ్ ప్రాక్టీషనర్ చట్టం ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయి అని ఆయన తెలిపారు..ఈపాటికే ప్రభుత్వ మరియు ప్రవేటు వైద్యశాల లో నర్సుల కొరత తీవ్రంగా వేదిస్తున్నది ఈ కొరత ఇలాగే కొనసాగితే డాక్టర్ దేవి శెట్టి గారు చెప్పినట్లు రాబోయే రోజుల్లో మన దేశం ఫిలిపియన్స్ మరియు థాయిలాండ్ నర్సస్ నియమించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు.లక్ష్మణ్ రూడవత్ గారు ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతం నర్సింగ్ వ్యవస్థ ఎదురుకొంటున్నా సవాళ్లను ఆయనతో పంచుకున్నారు.. దానికి ఆయన స్పందిస్తూ ముఖ్యంగా నర్సింగ్ విద్యాలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము . ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము.. అని చెప్పారు.. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర నర్సింగ్ విద్యా సంచాలకులు డాక్టర్ లత గారు, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ బి విద్యావతి గారు..మరియు అనేక మంది నర్సింగ్ ప్రతినిధులు ఈ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు