కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్టాలిన్ ఆయనకు దగ్గరుండి మరీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీనియర్ నేత వీరమస్తాన్‌రావు కావేరీ ఆస్పత్రికి వచ్చారు.
తీవ్ర అస్వస్థతతో గత నెల 27న కావేరీ ఆస్పత్రిలో చేరిన కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. రెండు రోజుల నుంచి అరగంట పాటు కుర్చీలో కూర్చోబెట్టి కరుణానిధికి ప్రత్యేక ఫిజియోథెరపీని వైద్యులు అందజేస్తున్నారు. కరుణానిధి పూర్తిగా కోలుకుంటున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.