Home / SLIDER / గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న యువ పెంయింటర్ ను సర్ ప్రైజ్ చేశారు. అరుదైన వ్యాదితో సతమతం అవుతున్న షేక్ నఫీస్ తనకున్న అద్బుతమైన పెయింటింగ్ కళను మాత్రం అపకుండా చిత్రాలు గీస్తూనే ఉంది. ఒకవైపు క్షీణించిపొతున్న కండరాల బలాన్ని సైతం ఏదిరిస్తూ, కేవలం వీల్ చెయిర్ మాత్రమే పరిమితం అయినా… తన కుంచె నుంచి అద్భుతమైన చిత్రాలాను జాలువారుస్తునే ఉన్నది. ఇలా తనూ గీసిన చిత్రాల్లోంచి అద్భుతమైన 50 చిత్రాలతో రవీంద్రా భారతిలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి ఏగ్జిబిషన్ కు మంత్రి సర్ ప్రైజ్ గెస్టుగా వచ్చారు. నఫీస్ తో మంత్రి ముచ్చటించారు. అమె కుటుంబసభ్యుల తోనూ మాట్లాడారు. తర్వతా చిత్ర ప్రదర్శను వీక్షించారు. అమె వేసిన పలు చిత్రాలను చూసి… గొప్ప కళ నఫీస్ సొంతం అంటూ ప్రశంసలు కురింపించారు. అరుదైన వ్యాధి ఒకవైపు పట్టిపీడిస్తున్నా… నిరాశా చెందకుండా మొక్కవోని ధైర్యంతో తన చిత్రకళను కొనసాగిస్తున్న నాఫీస్ కి మంత్రి అభినందనలు తెలిపారు.

నఫీస్ పట్టుదల ఏంతోమందికి స్పూర్తినిస్తుందన్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. తక్షణం పేద కళాకారులకు అందించే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని అక్కడి నుంచే పోన్లో మామిడి హరికృష్ణ తో మాట్లాడారు. దీంతోపాటు నఫీస్ కు అవసరమైన వైద్య సహకారాన్ని నిమ్స్ వైద్యులతో అందిస్తామన్నారు. ఈ మేరకు తన కార్యాలయం భాద్యత తీసుకుంటుదన్నారు. దీంతోపాటు తన వెంట ఉన్న మెట్రోరైల్ యండి ఏన్వీయస్ రెడ్డికి నపీస్ చిత్రపటాలను మెట్రో స్టేషన్లతో ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు. పలువురి స్పూర్తి కలిగించేలా ఉండేందుకు వేంటనే నపీస్ చిత్రపటాలను మెట్రో స్టేషన్లతో ఉపయోగిస్తామని మంత్రికి యండి తెలిపారు. నఫీస్ రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల చిత్రపటాలతో పాటు దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు పొందిన పలువురి చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించింది. తన ప్రదర్శనకు అనుకోని అతిధిలా వచ్చిన మంత్రి కెటి రామారావు నఫీస్ దన్యవాదాలు తెలిపింది. ఇలా మంత్రి నుంచి ప్రశంసలు దక్కడం తన చిత్రకళకు లభించిన గౌరవంగా తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావుకు తాను గీసీన మంత్రి స్వీయ చిత్రాన్ని బహూకరించింది నఫీస్ .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat