అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో చింతమనేనిని ఓడించేందుకు విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇతరత్రా వివాదాలతో చింతమనేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విపక్ష నేత వైఎస్ జగన్‌ను తీవ్ర పదజాలంతో విమర్శలు చేసాడు. దెందులూరు నియోజకవర్గాన్ని పూర్తిగా తనకు కంచుకోటగా మలచుకున్న చింతమనేనిపై జగన్ 2019 ఎన్నికల్లో సరికొత్త స్ట్రాటజీతో క్యాండెట్‌ను దించుతున్నారు. చింతమనేనికి గత రెండు ఎన్నికల్లోనూ సులువైన ప్రత్యర్థులపైనే గెలిచాడు. 2009లో విజయరాయి సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కొఠారు రామచంద్రరావుపై, 2014లో బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పై గెలిచారు. తణుకు ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరిని ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని దెందులూరు సీటు ఇవ్వడం వైసీపీ రాంగ్ స్ట్రాటజీ అయ్యింది. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌గా గతంలో ప్రభాకర్ మీద ఓడిన కొఠారు రామచంద్రరావు తనయుడు కొఠారు అబ్బయ్య చౌదరి ఉన్నారు. ఈయన గతంలో వైసీపీ యూరప్, యూకే కన్వీనర్‌గా ఉన్నారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడిగా ఉన్న అబ్బయ్య ప్రభాకర్‌కు బంధువు కావడంతో ఆయన అయితేనే ఇక్కడ పోటీకి సరైన వ్యక్తి అని జగన్ భావించారు. చింతమనేని ప్రభాకర్‌పై ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఓట్లు భారీగా చీలతాయని టాక్. వివాదాల వీరుడిగా పేరుగాంచిన చింతమనేనికి అబ్బయ్య ధీటుగా ఎదురెళ్తున్నారు. ఇటీవల చింతమనేని అక్రమ ఇసుక క్వారీకి అడ్డుగా నిలబడి నిలిపివేసాడు అబ్బయ్య. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా వ్యవహరించే ప్రభాకర్‌ను చంద్రబాబు సైతం గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి. ఏదో అప్పుడప్పుడు వార్నింగ్‌లు ఇవ్వడం మినహా సొంత పార్టీ పెడతానని ప్రభాకర్ చెప్పినా చంద్రబాబు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే చింతమనేనిపై వ్యతిరేకత, జగన్ పాదయాత్ర, అబ్బయ్య దూకుడుతో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గత ఎన్నికలకు ఇప్పటకీ చాలా మెరుగైందనే చెప్పుకోవాలి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన చింతమనేని నియోజకవర్గంలో అభివృద్ధి సేరుతో చేసిన కార్యక్రమం ఒక్కటికూడా లేదు.. అంతకు మించిన వివాదాలను భారీగా మూటకట్టుకున్నారు.
మహిళలపై దాడులు, ఇసుక దందా, భూ దందా, ప్రభుత్వ అధికారులపై దాడులు, ఇలా ఎన్నో వ్యవహారాలతో పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన చింతమనేని అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడ్డారు. ఈయన తన అనుచరవర్గంతో దెందులూరు నియోజకవర్గంలో రౌడీ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే, పై అంశాలన్నిటి దృష్ట్యా 2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల దెందులూరులో వైఎస్ జగన్ పాదయాత్రేనని, ఆ పాదయాత్రలో చింతమనేని ప్రభాకర్ జగన్ పాదయాత్రకు హాజరు కావొద్దంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినప్పటికీ.. ఆ బెదిరింపులను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రలో దెందులూరు ప్రజలు పాల్గొన్నారు. జగన్ కోసం దెందులూరు ప్రజలు పోటెత్తారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఒక్కసారిగా దడ పుట్టింది. మరో పక్క దెందులూరు వైసీపీ ఇంఛార్జి కొటారు అబ్బయ్య చౌదరి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలపై నిరంతరం పోరాడటమే కాకుండా.. ప్రజలను చైతన్య పరుస్తున్నారు. దెందులూరు ప్రజలు రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకోవడం కూడా వైసీపీకి కలిసొచ్చే అవకాశం. 2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం కూడా ఓ నాలుగుశాతం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.