వాట్సాఫ్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే అనేక ఫీచర్స్ అందించిన వాట్సాఫ్ ..తాజాగా వాట్సాఫ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నది. ఈ ఫీచర్ గురించి వాట్సాఫ్ గతేడాది అక్టోబర్‌లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా గత మూడు రోజులనుండి ఈ అద్భుతమైన ఫీచర్ ను వాట్సాఫ్ తన యూజర్లకు అందిస్తున్నది.అయితే వాట్సాఫ్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్ తో ఒకేసారి నలుగురు స్నేహితులు మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ముందుగా..ఇద్దరు స్నేహితులు 1 TO 1 వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి..అతరువాత మరో ఇద్దరు స్నేహితులను అందులోకి ఆడ్ చెయ్యాలి.ఈ విధంగా గ్రూప్ కాలింగ్ సాధ్యపడుతుంది.అయితే వాట్సాప్ గ్రూప్ వీడియో ఫీచర్ రాని యూజర్లు ఈ యాప్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ అద్బుతమైన ఫీచర్‌ను పొందవచ్చు.
