కృష్ణాజిల్లా మైలవరం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం.. కారణం ఇద్దరు బలమైన తలపడుతుండడంతో ఇరు పార్టీలూ పర్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టిడిపి నుంచి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీనుంచి వసంత కృష్ణప్రసాద్ లు బరిలోకి దిగుతున్నారు. అయితే వసంత్ ను ఓడించడానికి ఉమ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించట్లేదు. తన ప్రత్యర్థి తన సామాజికవర్గానికే చెందిన వారు కావడం, గతంలో తమ పార్టీలో ఉన్న వ్యక్తి కావడంతో ఇరువురు హోరాహోరిగా పోరాడుతున్నారు. నియోజకవర్గంలో టిడిపి, వైసీపీ నాయకులు బూత్‌ల వారీగా తమ సైన్యాన్ని మొహరిస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను తమ చేయిజారకుండా చూసుకుంటున్నారు.
ఉమ, కృష్ణప్రసాద్‌లు ఇద్దరూ ఆర్థికంగా గట్టివాళ్లే కావడంతో కొన్ని చోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గ్రామాలను అప్పుడే తన ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నారట. ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామ సమస్య చెప్పిన వెంటనే అధికారంలో లేకపోయినా వాటిని పరిష్కరిస్తూ ఉకంటే మీరే బెటర్ అనిపించుకుంటున్నారట.. తాజాగా విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌లపై కూడా తన బొమ్మలు ఉండేలా ఆర్టీసీతో వసంత్ ఒప్పందం కుదుర్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో మంత్రి ఉమ ఆర్టీసీ పాస్‌లపై రాజకీయనాయకుల బొమ్మలు వేయడం ఏమిటని ఆర్టీసీ అధికారులను నిలదీసి వాటిని ఉపసంహహరించినట్లు తెలుస్తోంది. దీనిపై ‘వసంత కృష్ణప్రసాద్’ ధ్వజమెత్తుతూ చాలామంది రాజకీయనాయకులు ప్రకటనలు ఇస్తున్నారని, తాను విద్యార్ధులకు తన గుర్తుగా సాయం చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా సేవచేస్తూ ముందుకెళతుంటే దీనిపై మంత్రికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దేవినేనికి ఓడిపోతారనే భయంతోనే ఈ విధంగా అడ్డుకుంటున్నారని కృష్ణప్రసాద్ ఆరోపిస్తున్నారు. అలయితే నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తనకు క్షణాల్లో తనకు తెలియాలని తాను పరిష్కరిస్తానని మంత్రి ఉమా మహేశ్వరరావు టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. తన చుట్టూ పదిమంది పిఎలను పెట్టుకుని వారంతా నియోజకవర్గ ప్రజలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని ఏ సమస్య చెప్పినా క్షణాల్లో తీర్చే విధంగా కృషి చేస్తున్నారట.. అయితే నాలుగేళ్లుగా దొరకకుండా తమను పట్టించుకోని ఉమగారు హటాత్తుగా వసంత కృష్ణ ప్రసాద్ ను చూసి ఓటమి భయంతో తమకు అందుబాటులోకి రావడం చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారట. అయితే పరువు సమస్యగా తీసుకున్న ఉమ అవసరమైతే నంద్యాల తరహా రాజకీయంగా మార్చైనా తాను గెలిచి తీరాల్సిందేనని భావిస్తున్నారట. అయితే వసంతకృష్ణప్రసాద్ కూడా దేనికీ వెనుకాడబోనంటున్నారట. మంత్రి దేవినేని అవినీతి చరిత్ర ప్రజలకు వివరింవచేందుకు ఆయన సిద్ధమవుతున్నారట.