కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వీరులపాడులో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో జరిగిన వరుస వివాదాలే ఇందుకు కారణం.. పార్టీ అధికారంలో ఉండడంతో మండలంలో అధిపత్య పోరు కోసం ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వివాదం పెరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో పోపురి అనిల్ తో పాటు మరికొందరిపై కర్రలు, రాడ్లతో మరొక వర్గ దాడికి దిగింది. అనిల్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో నందిగామ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాజధాని సమీపంలోనే అధికార తెలుగుదేశంలో ఎక్కడికక్కడ గ్రూపు తగాదాలు పెరిగిపోతుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.