రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎక్సిబిషన్ ఐప్లెక్స్ 2018 ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని సూచించారు.ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని తెలిపారు.టీ ఎస్ ఐపాస్ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీ లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని అన్నారు.ప్లాస్టిక్ ఇండస్ట్రీ లో చిన్న ,మధ్య తరహా కంపెనీలు 85 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.
