టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అని ఎమ్మల్సీ రాములు నాయక్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించి.. జాతిపిత, మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని అన్నారు.తండాలను గ్రామపంచాయితీలు గా మార్చడం వలన గిరిజనులకు అసలైన స్వతంత్ర్యం వచ్చిందని చెప్పారు.
కొన్ని దశాబ్దాల కల,గిరిజనుల ఆత్మగౌరవాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా, తెలంగాణ గిరిజనులకు మాత్రం అసలైన స్వతంత్ర్యం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆగస్టు 2న వచ్చిందన్నారు. గిరిజనులు ఇప్పుడు కేసీఆర్ ను ‘తెలంగాణ గాంధీ’గా భావిస్తున్నారని అన్నారు.గతంలో పాలించిన ప్రభుత్వాలు గిరుజనులను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకున్నాయని చెప్పారు .