మందు బాబులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది.వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం,శనివారం రాత్రి 1 గంటలవరకు బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అన్ని పని దినాలల్లో బార్లను ఉదయం 10 గంటల నుంచి …రాత్రి 12 గంటల వరకు ఉంచే అవకాశం ఉంది. వీకెండ్ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో గంట టైం అదనంగా పెంచాలంటూ బార్ల యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పొడగింపు నిబంధన GHMCతో పాటు…ఐదు కిలోమీటర్ల పరిధిలోనిక బార్లకే వర్తిస్తుంది.
