రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా పేరూరు లో చంద్రబాబు ప్రసంగిస్తూ రెండు గంటలపాటు ప్రజలను వీరబాదుడు బాది ఇబ్బంది పెట్టారన్నారు. గంటల తరబడి ప్రజలను చిత్రవధ చేసే ప్రక్రియలో భాగంగా నిన్న అనంతలో సభ జరిగిందన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ను చూస్తే వణికిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయసున్న ఆయన తనయుడిని చూస్తే అంతకంటే ఎక్కవ వెన్నులో దడపుడుతుందన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు మొదడు, నోరు అనే డ్రైనేజీ నుంచి దూసుకువచ్చే మలినం అంతా హైదరాబాద్ మూసీ మురికి కంటే హీనంగా ఉంది. వైయస్ జగన్ చేసిన వీరోచిత పోరాటాల కారణంగానే చంద్రబాబు జడిసి యూటర్న్ తీసుకున్నాడన్నారు. హోదా కావాలని ఢిల్లీ నగర వీధుల్లో వేలాది మందితో ధర్నా చేసి పార్లమెంట్‌ను ముట్టడికి యత్నిస్తూ వైయస్ జగన్ అరెస్టు అయ్యారని, కాపుల ఉద్యమాన్ని అణిచి తునిలో జరిగిన సభలో రైలు దగ్ధానికి చంద్రబాబు కారణమయ్యారన్నారు. చంద్రబాబు ఆదేశంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను టీడీపీ నేతలు తగలబెట్టారనేది వాస్తవమన్నారు భూమనవైయస్‌ఆర్ సీపీ ముద్రగడ పోరాటానికి మద్దతు ఇచ్చింది. ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారో.. 30 ఏళ్ల క్రితం కాపుల ఆత్మగౌరవ నినాదంతో ఉద్యమాలు చేసిన వంగవీటి మోహనరంగాను నట్టనడి వీధిలో హత్య చేసిన సంస్కృతి చంద్రబాబుదని, అప్పటి హోంమంత్రి హరిరామజోగయ్య ఆత్మకథను పరిశీలించాలని కాపు సోదరులకు విజ్ఞప్తి చేసారు.. రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అన్నారు. రాక్షసపాలన గుండెల్లో గునపాన్ని గుచ్చే వీరుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు భూమన.
