2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి..నేడు టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతీరేకత తెచ్చుకున్నారు. కనుక నేను అమలు చేయలేని హామీలు ఇవ్వను అని జగన్ చేప్పిన సంగతి తెలిసిందే . కాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అనడంతో వైసీపీ బలం ఏమీటో ప్రజలకు తెలిసిపోయింది. ఆ బలం ఏమిటో తెలుసా…అధినేత జగనే అంటున్నారు. అందుకే రెండు రోజులు క్రితం రెండు అంశాల్లో స్పష్టత ఇచ్చినందుకు జగన్ కు సన్మానం చేశారు. ఇక తాజాగా తమ సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జగన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాదు ప్రమాణం సాక్షిగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ని గురువారం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు కలిశారు. తమ కులానికి జగన్ ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి జగన్‌ను సన్మానించారు. వైసీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పి. పద్మావతి, చిట్నీడి సత్యవతి తదితర నాయకురాళ్లు.. జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
