చాలాకాలం తర్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒకరోజు వచ్చింది. పార్టీ కళకళలాడింది. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కదలికలు కనిపించాయి. గత నాలుగేళ్లుగా అడదడపా ధర్నాలు, ప్రకటనలు తప్ప ఏపీలో కాంగ్రెస్ సందడి లేదనే చెప్పాలి. నిన్న మళ్లీ విజయవాడలో కాంగ్రెస్ కార్యాయలం వద్ద పండగవాతావరణ కనిపించింది. కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చారు. అసలు ఈ హడావిడి మొత్తానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాక తొలిసారి విజయవాడ రావడమే. కిరణ్ కూమార్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయం నుంచి ఘన స్వాగతం లభించింది. మహిళ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడ వచ్చారు. గన్నవరం నుంచి విజయవాడ ప్రభుత్వ అతిధి గృహానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీతో కలసి చేరుకున్నారు.విజయవాడ ప్రభుత్వ అతిధి గృహంలో కిరణ్ కుమార్ రెడ్డి సందడి మొదలయింది. అనేక మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయననుకలుసుకున్నారు. శాలువలు కప్పి స్వాగతం పలికారు.
తర్వాత ప్రభుత్వ అతిధి గృహం నుండి యుత్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఆంధ్రరత్న భవన్ కు బయలు దేరారు. దారి పొడగునా కిరణ్ కు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపించింది. 2014లో కాంగ్రెస్ ఓడిపోయాక చాలామంది టీడీపీ, వైసిపిలోకి వెళ్లిపోవడం, కొందరు మౌనంగా ఉండటమో జరుగుతుంది. అక్టోబర్ 2 నుంచి ఇంటి ఇంటికి కాంగ్రెస్ పేరు తో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని నేరుగా కలుస్తాం కలుస్తామని కిరణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం లో కేంద్రంలో అధికారంలోకి రాగానే అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చెయ్యడం జరగుతుందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తరఫున రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వస్తేనే అంధ్రప్రదేశ్ కి ర న్యాయం జరుగుతుందని ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని, ఆగస్టు మూడవ వారంలో రాహుల్ గాంధీ అంధ్రప్రదేశ్ పర్యటన వస్తున్నారని, అపుడు కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే 2014పరిస్థితుల దృష్ట్యా క్యాడర్ వైసీపీ, టీడీపీలోకి వెళ్లిపోవడం కిరణ్ న్యాయకత్వానికి ఆకర్షితులయ్యేవారు కనిపించకపోవడంతో కాంగ్రెస్ ఆశలు ఎండమావిలాగే కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.