రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) తనయుడు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇవాళ సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే గత 6 నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో చెప్పారు.
ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఒక్కసారిగా భగ్గమన్నాయి. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు.