తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మంత్రి కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్ర్తాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.