Home / POLITICS / సిర్పూర్ పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి..!!

సిర్పూర్ పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తిరిగి ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.ఈ మిల్లు రీ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారని చెప్పారు.ఓ వైపు మూత పడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించి యుతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే…మరోవైపు కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జేకే గ్రూప్ చాలా పేరున్న సంస్థ అని… పేపర్ మిల్లును మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు. పాత కార్మికులకులందరినీ పేపర్ మిల్లులో కొనసాగించాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసామన్నారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం తరుపున పూర్తి మద్దతు ఉంటుందని… జేకే యాజమాన్యం అతితక్కువ సమయంలో మిల్లును ప్రారంభించి కార్మికుల జీవితంలో వెలుగులు నింపాలన్నారు మంత్రి కేటీఆర్.

ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వం అందరికీ సర్కారు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకే ప్రైవేట్ పరిశ్రమలు ప్రోత్సహించడంతోపాటు ..అందులో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందజలో ఉందన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులతో పాటు పరిశ్రమలకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat