భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభైన కొద్ది నిమిషాలకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. రెండో రోజు రెండో ఓవర్‌లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్‌ను కోల్పోయింది. 90వ ఓవర్లో ఉమేష్ యాదవ్ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న కర్రన్(24)… వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ 4, మహమ్మద్ షమి 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మకు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు రూట్(80), బెయిర్‌స్టో(70), జెన్నింగ్స్ (42) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేయగలిగారు.
