ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సార్వత్రిక సమయంలో కురిపించిన ఆరు వందల ఎన్నికల హమీలలో ఒకటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి .అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏండ్లైన తర్వాత ఇప్పుడు వారికి నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయాలు ఇవ్వనున్నట్లు ఈ రోజు గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్ సందర్భంగా ఆమోదిస్తున్నట్లు బాబు ప్రకటించాడు..
దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పన్నెండున్నర లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయాలు ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది.. అయితే ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం పేరు ఖరారు చేసింది టీడీపీ సర్కారు ..