ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీపార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గొల్లప్రోలు మీదుగా తాటిపర్తి క్రాస్ వరకు జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్‌జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రోజు వేలాది మంది ఆయనతో పాలు అడుగులో అడుగు వేస్తున్నారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసాకల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
