ప్రస్తుతం రాష్ట రాజకీయలను షేక్ చేస్తున్న అంశం కాపు రిజర్వేషన్లు.. అసలు సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50% కాబట్టి ఏపీలో ఇప్పటికే వున్న రిజర్వేషన్ల శాతం 50కి చేరుకుంది కాబట్టి కొత్త రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెప్తే ఎక్కడినుండి తెచ్చిఇస్తారు అని అడగాలి.. ఎందుకంటే.? ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వంచే చట్టం చేయబడి, పార్లమెంట్ లో బిల్లు పాసై రాష్ట్రపతిచే, సుప్రీం కోర్ట్ చేత ఆమోదింపబడితే, 50% మించి రిజర్వేషన్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఇది కార్య రూపం దాల్చేపనేనా.? ప్రత్యేక హోదా ఏమైంది..
50% పై రిజర్వేషన్లకు సుప్రీంకోర్టును ఒప్పిస్తే అది దేశమంతా అమలవుతుంది.. ఆంధ్రాకూ వర్తిస్తుంది. కాంగ్రెస్ గానీ భాజపా కానీ ఆదిశగా ఎప్పుడైనా, ఎక్కడైనా హామీలిచ్చారా.? మరి ఏలెక్కన కాపులకు, వేరే కులాలకు అమలుసాధ్యం గానీ 50% మించి రిజర్వేషన్ హామీ చంద్రబాబు ఇచినట్టు. అబద్ధపు హామీ ఇచ్చి, ఉత్తుత్తి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపి, కేంద్రంపై ఆరోపణ చేస్తుండాలి… ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదదే. ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రజల్ని మోసం చేసి, ఎన్నికల్లో గెలుపే ప్రధాన మనుకుంటే రిజర్వేషన్ హామీ ఇవ్వొచ్చు. గెలిచిన తరువాత సంగతి దేవుడెరుగు అన్న విధంగా ప్రస్తుత రాజకీయం ఉన్న ఈ రోజుల్లో జగన్ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. తునిలో రైలు తగలబెడితే ఆపని రాయలసీమ రౌడీలు చేశారని, జగన్ మనుషులు చేసారని నిందలు వేసినా జగన్ మౌనంగా భరించాడు.
కాపు ఉద్యమ ఘటనలో వందలమంది కాపులను జైళ్ళలో పెట్టినప్పుడు మొత్తం పార్టీయే అండగా ఉంది.. జగన్ ను విమర్శించటానికి మీకీ నోరెలా వచ్చింది ముద్రగడ గారు.? అని ఎందరో కాపులు జగన్ కు అండగా నిలిచారు.అయితే జగన్ ఇచ్చిన ఝలక్ తో భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ తాము ఫలానా కులం వారిని బీసీల్లో, యస్సీల్లో, యస్టీల్లో, చేరుస్తామని హామీ ఇవ్వడానికి జంకుతారు.కులాల వారీ రిజర్వేషన్లు కూడా జగన్ ఇచ్చిన క్లారిటీతో పలు రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగింది
జగన్ పాదయాత్రలో అందరి రాజకీయ నాయకులిచ్చే అలవి కాని, ఆచరణ సాధ్యం కాని(రుణ మాపీ వగైరా), హమీలన్నిటీనీ, తూర్పారబట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. రాజకీయాలలో ఒకవిధంగా ఇదొక కొత్త ఒరవడి. ఈపాటికే మేధావులు, రాజనీతిజ్ఞులు జగన్ ని అభినందిస్తున్నారు.
కాని దురద్రృష్టవశాత్తు అందరికీ స్వఛ్ఛమైన, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు కావాలి, కాని అలాచేయటానికి ముందు కొచ్చిన వారిని అభినందించి, ప్రోత్సహించకపోవడం బాధాకరం.. నాయకుడు మాట చెప్పాడాంటే అందులో ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. కాపు రిజర్వేషన్లు రాష్ట ప్రభుత్వ చేతుల్లో లేని అంశం.. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసి కొట్టేయించవచ్చని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాడు జగన్.. ఇక మొన్న 5% రిజర్వేషన్లు ఇచ్చాము బీసీ”F” కేటగిరీలో చేర్చామూ అని లడ్డులు పంచుకుని ఫ్లెక్సీలు కట్టించుకుని కాపులను మోసం చేస్తూ మభ్యపెడుతున్న టీడీపీ అసలు రూపం బయటపడింది.. అయితే మంత్రి యనమల స్టేట్మెంట్ ముద్రగడ కళ్ళకు కనబడలేదా.. ఇక జనసేన కాపులను ఉద్ధరించే పార్టీ అని బీరాలు పలుకుతున్నప్పటికి ఆ పవన్ కళ్యాణ్ ఈ రిజర్వేషన్లు పై ఏ పోరాటం గాని ఆచరణ గాని చెయ్యడం లేదు. ముఖ్యంగా ముద్రగడ జగన్ పై నిందలు వేసి ఆయనకు కాపుల్లో ఉన్న కొద్ధోగొప్పో పేరు-పరువు కూడా పోగొట్టుకున్నాడని, తన కుటుంబాన్ని దారుణంగా అవమానించిన టీడీపీ తో ఆయనకు ఉన్న లాలూచీ ఒప్పందాన్ని ప్రజలముందు ఉంచాడు. కాపుల రిజర్వేషన్లపై వైస్సార్సీపీ స్టాండ్ ఎంతో క్లియర్ గా చెప్పారు జగన్.
రిజర్వేషన్లు తన చేతిలోని పనికాదు కేంద్రం చేతుల్లో ఉంది దానికోసం పొరాడుదామని, రిజర్వేషన్లు వచ్చేలోపు కాపుల్లో ఉన్న పేద-మధ్యతరగతి వారి అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబులా మోసం చెయ్యకుండా ప్రతి ఏటా 2000 కోట్ల నిధులు ఇచ్చి వారిలో స్వయంప్రగతి సాధించడానికి తోడుంటానని జగన్ చెప్పారు. ఈ అంశాలను బేరీజు వేసుకుని ముద్రగడ కావొచ్చు ప్రతీ కాపు సోదరుడు కావొచ్చు ఎవరు తమకు మేలు చేస్తున్నారో, ఎవరు మోసం చేస్తున్నారో ఆలోచించుకోవాలి.
ఈ అంశాలను బేరీజు వేసుకుని ముద్రగడ కావొచ్చు ప్రతీ కాపు సోదరుడు కావొచ్చు ఎవరు తమకు మేలు చేస్తున్నారో, ఎవరు మోసం చేస్తున్నారో ఆలోచించుకోవాలి. ఇక రాజకీయంగా కాపులకు వైఎస్ ఎంత మేలు చేసారో ఎవరికీ చెప్పనవసరం లేదు.. కాపులను కొట్టించిన వ్యక్తీ ఎవరో చెప్పాల్సిన పని లేదు.. ఈ అంశాలను ప్రచారం చేయాల్సింది మారం వైసీపీ శ్రేణులే.