నటి శ్రీరెడ్డి, గత కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌తోపాటు.. కోలీవుడ్‌లోనూ కొందరు బఢా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అమ్మాయిలు రాబంధుల్లా పీక్కు తింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఖరుకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై స్పందించిన శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక పక్క పెళ్లాంతో కాపురం చేస్తూనే.. మరో పక్క మరో యువతితో అక్రమ సంబంధాలు నెరుపుతున్న వ్యక్తి.. ఒక స్టార్ హీరో పవన్ కళ్యాన్ మాత్రమేనని, పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధాలన్నింటిని ఆధారాలతో సహా బయటపడ్డాయని చెప్పింది.
అయితే, ఈ వ్యాఖ్యలపై మెగా డాటర్ కొణెదల నిహారిక స్పందిస్తూ శ్రీరెడ్డికి నిహారిక కౌంటర్ ఇచ్చింది. శ్రీరెడ్డి చెప్పిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకే పరిమితం కాదని, ప్రతీ రోజు న్యూస్ పేపర్లను ఫాలో అయితే.. కొన్ని వందల సంఖ్యలో చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు లైంగిక వేధింపులకు బాధితులవుతున్నారని, శ్రీరెడ్డి మాత్రం కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకే లైంగిక వేధింపులను అంటగట్టడం సరికాదని పేర్కొంది నిహారిక. ఎదుటి వారి ప్రమేయం లేకుండా.. బలవంతంగా చేస్తే దాన్ని రేప్ అంటారు.. లైంగిక వేధింపులు అంటారు.ఇటువంటిది ఇద్దరి ఇష్టానుపరంగా కలిస్తే దానికి క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం సరికాదని నిహారిక అభిప్రాయపడింది.