గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణం ఒకే సారి లక్షా 116 మొక్కలు నాటి రికార్డ్ క్రియేట్ చేసింది.నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.గజ్వేల్ లోని బస్టాండ్ చౌరస్తా లో కదంబ మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ నాటారు.
ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు నాటారు. ఆ తర్వాత గజ్వేల్ లో మొక్క నాటారు. సీఎం మొక్క నాటిన తర్వాత సైరన్ మోగించారు. ఆ తర్వాత గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, అన్ని రోడ్ల వెంట, ఔటర్ రింగ్ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు.
గజ్వేల్ లో మొక్క నాటిన తర్వాత.. ప్రజ్ఞాపూర్ ,తుర్కపల్లి, ములుగులో కూడా కేసీఆర్ మొక్క నాటారు. ప్రజ్ణాపూర్ లో ఎంతో కాలంగా నర్సరీ నిర్వహిస్తూ.. మొక్కలను పంపిణీ చేస్తున్న వారిని అభినందించారు. వారితో కలిసి ఫొటో దిగారు. వీధుల్లో మొక్కలు నాటుతున్న స్థానికుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు.