Home / POLITICS / హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!

హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!

భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, సిఎం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరాలన్నారు. ఈ వరంగల్ అర్భన్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామం, బెస్తం చెరువు దగ్గర పది ఎకరాల స్థలంలో మొక్కలు నాటి నాల్గవ విడత హరితహారాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇక్కడ ప్రారంభించారు.

తెలంగాణను హరిత తెలంగాణ చేసే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ హరితహారం పథకం రూపొందించి 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ 230 కోట్ల మొక్కలలో 120 కోట్ల మొక్కలను సామాజిక అడవుల్లో, 100 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతంలో మరో 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ లో నాటాలని నిర్ణయించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతలుగా 81 కోట్ల మొక్కలు నాటారన్నారు. ఈ నాల్గవ విడతలో 40 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం నిర్ధేశించారన్నారు. ఇందులో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలను కోరారు.

ఈ సంవత్సరం హరిత తెలంగాణ – హరిత పాఠశాల పేరుతో విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాలు గుర్తించి పక్కా ప్రణాళిక రూపొందించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై హరిత పాఠశాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటి ఆవరణలో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థులతో పాటు ఈ మొక్కలు పెరిగి, పెద్దవై మంచి భవిష్యత్ ఇస్తాయన్నారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాన్ని పూర్తిగా దున్ని, లే అవుట్ చేసి మొక్కలను పద్దతి ప్రకారం నాటాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల వైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. తెలంగాణలో భాగస్వామ్య ప్రజలు, చిత్తశుద్ధి ఉన్నఅధికారులు ఉండడం వల్లే ఈ పథకాలు విజయవంతమై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. ఆగస్టు 15 నుంచి అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ కింద నీళ్లు ఇస్తామని, ఆ తర్వాత ఇంటింటికి నీరందిస్తామని చెప్పారు. అదేవిధంగా నిజాం కాలం నాటి చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరిస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలని ఈ హరితహారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ హరితహారం కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సిఎం కేసిఆర్ నిర్ధేశించిన లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు కొండా సురేఖా, అరూరి రమేష్, చైర్మన్లు గుండు సుధారాణి, మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ లలితా యాదవ్, కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ రవీందర్, మునిసిపల్ కమిషనర్ గౌతమ్, వరంగల్ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి అక్భర్, జిల్లా అటవీ శాఖ అధికారి అర్పన తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat