నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ,రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలుజాతి పశువుల ప్రదర్శనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం పట్టుదల చారిత్రత్మక మైనదని అభివర్ణించారు. రాష్ట్ర రాజధానికి రోజువారీ అవసరమయ్యే మాంసం 5 నుండి 6 లోడ్లు పడుతుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ఇక్కడికి అవసరమయ్యే మాంసాన్ని ఇక్కడే తయారుచేసుకునేవిధంగా గొర్రెల పెంపకాన్ని ప్రారంభిస్తే.. విపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విరుచకపడ్డారు. ఇప్పటికి హైదరాబాద్ కు అవసరమయ్యే కూరగాయలు కుడా దిగిమతి చేసుకునే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.అటువంటి పరిస్తితుల నుండి బయట పడేసేందుకే కులవృత్తులకు ప్రోతాహం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వాగులు,వంకలు,చేలిమేలు,ఊటబావులు,మోట బావులు, ఆయిల్ ఇంజన్ లు మొదలు కొని 300 అడుగులు మొదలుకొని 800 అడుగులనుండి పాతాళగంగ ను పైకి తెచ్చి వ్యవసాయం చేస్తున్న ఘనతః ముమ్మాటికి ఇక్కడి రైతంగానికే దక్కుతుందన్నారు. డిమాండ్ పెరగడం ఉత్పత్తులు తగ్గడం వల్లనే పాలాలోను కల్తీ జరుగుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఒక్క పాలలోనే కాకుండా పాల తరువాత అంతటి ప్రాదాన్యాత ఉన్న నీళ్ళలోను ఉమ్మడి నల్గొండ జిల్లాకు అన్యాయమే జరిగిందన్నారు.యావత్ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రములోని భూములు అన్ని పంటలకు అనువైనవని అటువంటి నేలను నమ్ముకోవడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలలో గుణాత్మక మార్పు వచ్చిందని,ఆ మార్పే రేపటి బంగారు తెలంగాణా నిర్మాణానికి పునాది అవుతుందన్నారు.