తూర్పు గోదావరి జిల్లా గడ్డపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కాపు రిజర్వేషన్ల సంచలన ప్రకటనపైనే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ గోదావరి జిల్లా వాసి జగన్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆలేఖ ఈ విధంగా ఉంది..
జగన్ గారూ మీరెవరండీ బాబూ రిజర్వేషన్లు కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఎన్నికల ముందు కచ్చితంగా ఇచేస్తాం అనాలండి.. గెలిచాక పట్టించుకోకూడదు.. గట్టిగా అడిగితే మెల్లగా ఓ కమిటీ వేయాలి, నెలలపాటు తాత్సారం చేయాలి, నాలుగైదు సార్లు ఆ పని మీదే ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పాలండి.. ఇచ్చిన హామీని నెరవేర్చమని ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళకు ‘అభివృధ్ధి నిరోధకులు’ అని ముద్ర వేయాలండి.. పెద్దపెద్ద సభలు పెట్టి నిరసనలు తెలిపేదాకా పరిస్థితిని తీసుకురావాలి, ఆ విషయంలో జరిగే విధ్వంసాలన్నిటి వెనుక విపక్ష పార్టీ వాళ్ళున్నారని ప్రచారం చేయించాలండి..
దీక్షలు, ధర్నాలు అంటూ ఎవరైనా సిధ్ధమయితే ‘ఇది శాంతిభద్రతల సమస్య’అంటూ ఊదరగొట్టి హౌస్ అరెస్టులు చేయించాలండీ ఆయ్.. ఈ మొత్తం ప్రాసెస్ లో ప్రెస్ మీట్లు అన్నీ మన పార్టీలోనీ ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పెట్టించి వాళ్ళను వాళ్ళతోనే తిట్టింఛి పారేయ్యలెండి.. ఫలానా కులానికి రిజర్వేషన్ ఇస్తే మరో కులం వాళ్ళకు నష్టం అని ఆ రెండు కులాల మధ్యలో నిప్పు రాజేసి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకుంటూ కథను నడిపించాలి కానీ ఇలా నిజాయితీగా మాట్లాడితే ఎలాగండీ. చేయగలినవే చెప్పి చేయలేనివి చెప్పలేను అంటే ఏం బాలేదు సార్. ఇన్నేళ్ళయినా మీరు రాజకీయం నేర్చుకోకపోతే ఎలా అండీ బాబూ.. అంటూ ఆ లేఖ జగన్ కు అందించాడట.