ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు. జగన్ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు. మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు జగన్ సీఎం అయితేనే అమలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని విజయచందర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నటులు..నటీమణలు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని , పాదయాత్ర ముగియాగానే నిన్ను కలసి..వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పృథ్వీ జగన్ తో చేప్పినట్లు తెలుస్తుంది. ఇంకా యంగ్ హీరోలు నీ పాలన కోసం వైసీపీ పార్టీలోకి వచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్దంగా ఉన్నారని, చాల మంది వస్తాం..మా మాటగా అన్నకు తెలియజేయి అని కొంతమంది హీరోలు చెప్పినట్లు సమచారం. మరోవైపు వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.