ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె.రాఘవ కన్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామున గెండెపోటుతో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి గ్రామంలో 1913 డిసెంబర్ 9న ఆయన జన్మించారు. సినిమాలపై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ అంచెలంచెలుగా ఎదిగారు.
సుఖదుఃఖాలు, జగత్కిలాడీలు, తాతామనవడు, చదువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. 1973లో సంసారం సాగరం సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్యం పురస్కారంతోపాటు 2012లో రఘుపతి వెంకయ్య చలన చిత్ర అవార్డులను కైవసం చేసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు వంటి వారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కె.రాఘవ నిర్మాతగా వ్యవహరించిన 27 సినిమాల్లో 25 చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.