ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ తాప్సీని ఉద్దేశించి బాలీవుడ్‌లో తాప్సీ చెత్త నటి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో రెండు మూడు చిత్రాలకన్నా ఆమె ఉండదని పోస్ట్ పెట్టాడు.
నెటిజన్ కామెంట్‌పై రియాక్ట్ అయిన తాప్సీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనవి మూడు సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయని తెలిపింది. ప్రేక్షకులు సినిమాలు చూసే తీరే మార్చుకుంటే బెటరని సలహా ఇచ్చింది. తాను రీసెంట్‌గా ముల్క్, బల్దా చిత్రాల్లో నటించానని తాప్సీ చెప్పింది. మరో రెండు సినిమాలకు కూడా సంతకం చేసినట్టు చెప్పింది. అంటే మరికొంత కాలం తనను భరించాల్సిందేనని ఆ నెటిజన్‌కు తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది.