సినీ నటి శ్రీరెడ్డి. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పేరిది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని తనను కొందరు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు తనను చెప్పరాని రీతిలో లైంగికంగా వేధించారంటూ సంచలన విషయాలను బయట పెట్టడమే కాకుండా.. ఆధారాలతో సహా మీడియా ముందుంచింది. అందులో భాగంగా, బయటకు వచ్చిన ఫోటోనేజజ బఢా ప్రొడ్యూసర్ సురేష్‌బాబు తనయుడు అభిరామ్, శ్రీరెడ్డి ఫోటో. ఆపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా తనను అవకాశాల పేరిట లైంగికంగా వేధించాడని, ఆ ఆధారాలను త్వరలో బయట పెడుతానంటూ మీడియా వేదికంగా చెప్పింది శ్రీరెడ్డి.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శ్రీరెడ్డికి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే శ్రీరెడ్డి స్పష్టం చేసింది. కావాలంటే తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను చూస్తే అర్థమవుతుందని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో నీచమైన భాషను ఉపయోగిస్తూ తనను తిడుతున్నారని, ఆ మాటలు తనను ఎంతో బాధించాయని శ్రీరెడ్డి చెప్పింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
— Sri Reddy (@ActressSriReddy) July 31, 2018