Home / SLIDER / మాట ఇస్తే నిలబెట్టుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం

మాట ఇస్తే నిలబెట్టుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం

మాట ఇస్తే నిలబెట్టుకునేది ఈ తెలంగాణ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, నెక్కొండలో గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసి, అక్కడ విద్యార్థినిల వసతి కోసం నిర్మించిన డార్మెట్రీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిలకు జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం తరగతి చెప్పారు.

ఏడాది క్రితం నెక్కొండ గురుకుల విద్యాలయం మార్గంలో తాను వెళ్తూ, వెళ్లూ రాత్రి సమయంలో ఇక్కడకు వచ్చానని, అప్పుడు ఇక్కడ సరైన వసతి లేదని, జూనియర్ కాలేజీ కావాలని విద్యార్థినిలు అడగడంతో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు జూనియర్ కాలేజీకి అప్ గ్రేడ్ చేసుకోవడం, కొత్త డార్మెట్రీ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందుకే ఈ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకునేదని, సిఎం కేసిఆర్ విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి గురుకుల విద్యాలయాలను దేశంలో ఎక్కడా లేనన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.

గత పాలనతో విద్య భ్రస్టు పట్టిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దీనిని గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గతంలో ప్రభుత్వ విద్యాలయాల్లో వసతులు లేక, నియామకాలు చేయక, నిధులు ఇవ్వక, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడంతో అందరూ ప్రైవేట్ స్కూళ్లలో చేరారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పెంచి, నాణ్యమైన విద్య అందిస్తుండడంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందన్నారు. అందుకే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 300 గురుకులాలుంటే…గత నాలుగేళ్లలో సిఎం కేసిఆర్ నాయకత్వంలో 570 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. వీటితో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసుకోగా, వీటిలో కొత్తగా 85 కేజీబీవీలు వచ్చాయన్నారు. ఈ ఏడాది నుంచి 33 సాధారణ గురుకుల పాఠశాలలను, 85 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామన్నారు. పట్టణాల్లో డిగ్రీ చదవే ఎస్సీ, ఎస్టీ బాలికలకు కులం పేరుతో గదులు అద్దెకు ఇవ్వడం లేదని తెలుసుకున్న సిఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు 53 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మరో 119 గురుకులాలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అదేవిధంగా గురుకులాల్లో విద్యార్థులు బాగా చదువుతున్నారని, సాధారణ గురుకులాలను కూడా జిల్లాకు రెండు ఏర్పాటు చేయడం కోసం మరో 27 గురుకులాలని ఇవ్వాలని సిఎంని కోరితే సుముఖత వ్యక్తం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని గురుకుల విద్యాలయాలు లేవన్నారు. ఈ గురుకుల విద్యాలయాలకు ఏటా 3500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు.

వరంగల్ లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రానున్న ఐదారు నెలల్లో పూర్తిగా మార్చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అన్ని మౌలిక వసతులు, టాయిలెట్లు, తాగునీరు, కాంపౌండ్ వాల్స్, పెయింటింగ్ వేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం విద్యకోసం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని, అయితే ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నెక్కొండ జూనియర్ కాలేజీలో విద్యార్థినిల సంఖ్యకనుగుణంగా డార్మెట్రీ భవనం లేదని, అందుకోసం మరో 3 కోట్ల రూపాయలను డార్మెట్రీ కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గురుకులంలో కాలువ ఉన్నందున విద్యార్థినిలకు ఇబ్బందులు ఏర్పడకుండా నెల రోజుల్లో ఎల్.ఈ.డీ లైట్లు అమర్చాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా బాలికల జూనియర్ కాలేజీ కావడంతో ఇక్కడ ఆకతాయిలు రాకుండా పోలీసులు నిరంతర పెట్రోలింగ్ ను నిర్వహించాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో 7వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదివే బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హెల్త్ అండ్ హైజీన్స్ కిట్స్ అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ కోసం ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దాదాపు 6 లక్షల మంది విద్యార్థినిలకు వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా బాలికలకు ఇలాంటి కిట్స్ ఇవ్వడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, గురుకుల విద్యాలయ సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat