దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని, ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ వ్యవహారశైలి అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల అబివృద్దికి జగన్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన అన్నారు..విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగాల్లో రాణించే విధంగా వైసీపీ పథకాలు ఉండబోతున్నాయని తెలిపారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ తగిన బుద్ది చెబుతారని అన్నారు.
