Home / Uncategorized / దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్

దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్

ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు, దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించాడంతో పాటు మిగిలిన కొద్ది పాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కోరారు. మిషన్ భగీరథపై బుధవారం ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించారు.

మంత్రి  జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్  వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు  జె. సంతోష్ కుమార్, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇఎన్సీ కృపాకర్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు, మిషన్ భగీరథ సలహాదారులు  జ్ఞానేశ్వర్, శ్రీ మనోహర్, సీఇ  విజయప్రకాశ్, ఎమ్మెల్యేలు  జీవన్ రెడ్డి, కనకయ్య, ఎమ్మెల్సీ సలీం తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఒక్క సారి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసిన తర్వాత, ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని సీఎం ఆధికారులను కోరారు. పనులన్నీ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిర్మించిన ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఒహేచఎస్ఆర్, ఒహేచ్ బీఆర్, డిస్ట్రీబ్యూటరీ పైపులైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్లన్నిటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో స్వయంగా మిషన్ భగీరథ వైస్ చైర్మెన్, సెక్రెటరీ, ఇఎన్సీ స్వయంగా పర్యటించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందుల గిరించి ముఖ్యమంత్రి నేరుగా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజన్సీలతో సీఎం మాట్లాడి అప్రమత్తం చేశారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat