బ్రాండ్ తెలంగాణ కు తోడ్పడతా – న్యూ జీలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్
ఈ రోజు ఉదయం న్యూ జీలాండ్ లోని ఆక్లాండ్ లో బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీతవిజయ్ , సహా -వ్యవస్థాపకులు విజయభాస్కర్ రెడ్డి కొసన , కళ్యాణ్ రావు కాసుగంటి , బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ కిరణ్ కుమార్ పోకల , మరియు సుశాంతి అరుణ్ ప్రకాష్ న్యూ జీలాండ్ మెంబెర్ అఫ్ పార్లమెంట్ శ్రీమతి ప్రియాంకా రాధాకృష్ణన్ ను కలిసి తెలంగాణ చేనేత,హస్త కళాకారుల ,టూరిజం అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరారు .
ముందుగా బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు శ్రీమతి సునీత విజయ్,మరియు శ్రీమతి సుశాంతి అరుణ్ ప్రకాష్ మొట్ట మొదటి దక్షిణ భారతదేశ సంతతికి చెందిన ఎంపీ ప్రియాంకా కు పూలగుచ్చం అందించి అభినందించారు . అనంతరం సునీత విజయ్ బ్రాండ్ తెలంగాణ ఏర్పాటు , ముఖ్య ఉద్దేశాలను వివరించారు . తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత సీఎం కెసిఆర్ గారి పిలుపు మేరకు తమ వంతు బాధ్యతగా , తెలంగాణ గొప్పతనాన్ని తెలిపే హస్త కళలను , చేనేత, ఫిలిగ్రి , నిర్మల్ బొమ్మలు మరియు ఇతర చిత్ర కళల మరియు టూరిజం ప్రాముఖ్యతను , న్యూ జీలాండ్ లో నివసించే ప్రజలందరికి పరిచయం చేస్తూ ,ఎలాంటి లాభాపేక్ష లేకుండా , తెలంగాణ ఉత్పత్తిదారులకు లాభం చేకూరే విధంగా న్యూ జీలాండ్ లో విక్రయిస్తున్నట్టుగా తెలిపారు . ఈ మా ఉద్దేశ్యానికి మంచి స్పందన ఉందని తెలిపారు .
రాజన్న సిరిసిల్ల జిల్లా , నేతన్న
నల్లా విజయ్ తయారు చేసిన పట్టుచీరను ఎంపీ ప్రియాంకకు బహుకరించారు . ఆలాగే నల్లా విజయ్ తయారుచేసిన అగ్గిపెట్ట చీరను , ఆలాగే మరొక రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్న హరిప్రసాద్ అగ్గిపెట్ట లో పెట్టె శాలువాను , ఉంగరంలో నుండి దూరే చీరలను ,సిల్వర్ ఫిలిగ్రి ప్రదర్శించారు . అంతకు ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ , ఏర్పడిన అనంతరం తెలంగాణ అభివృద్ధి లో ఎలా ముందుకు దూసుకు పోతుందో మరియు మొదటి తెలంగాణ మహిళా ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గతంలో న్యూ జీలాండ్ పర్యటించారని విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు .తెలంగాణ చేనేత కోసం గౌరవ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు తీసుకుంటున్న నిర్ణయాల గురించి .nri కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా గారి , ప్రోత్సాహంతో బ్రాండ్ తెలంగాణ కాన్సెప్ట్ ఇతర దేశాల్లో కూడా మునుముందు చేపట్టబోనున్నారని
కళ్యాణ్ రావు కాసుగంటి లు వివరించారు .
TSIPASS గురించి కిరణ్ వివరిస్తూ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనదని , పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రము తెలంగాణ అని ఆలాగే తెలంగాణాలో వాటర్ ప్రాజెక్ట్స్ గురించి, రైతుల కోసం 24 గంటల నాణ్యమైన కరెంటు గురించి,ఒకప్పుడు పాలమూరు , జిల్లా నుండి వలస వెళ్లిన వారు మళ్లీ తిరిగి రావడం అనేది కేవలం కెసిఆర్ , హరిశన్న మరియు నిరంజన్ రెడ్డి ల కృషి ఫలితం సుశాంతి అరుణ్ ప్రకాష్ అని వివరించారు.
ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురుంచి ,తెలంగాణ చేనేత, హస్త కళ , చిత్రకళా నైపుణ్యాల గురించి తెలుసుకొని అబ్బురపడ్డానని , బ్రాండ్ తెలంగాణ కు ప్రచారం కల్పించడంతో పాటు , వీలైతే తెలంగాణ సందర్శించాలని ఉందని తెలిపారు. న్యూ జీలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీమతి జసిందా అర్డర్న్ కు కూడా తెలంగాణ గురించి వివరిస్తానని తెలిపారు . ఎంపీ ప్రియాంకా దాదాపు గంటన్నర సమయం కేటాయించి తెలంగాణ విశిష్టతను తెలిపే అవకాశం ఇచ్చినందుకు శ్రీమతి సునీత విజయ్ ధన్యవాదాలు తెలిపారు .