కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయగలదని చెప్పారు. ఏపీతోపాటు అనేక రాష్ట్రాలు రిజర్వేషన్లపై డిమాండ్ చేస్తున్నాయని, ఈ విషయంలో రాష్ట్రాలన్ని సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. రిజర్వేషన్లుపై కేంద్ర ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీటిపై తగిన చర్యలు తీసుకుని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని యనమల డిమాండ్ చేశారు.
