జగన్‌కు, పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు తెలుసా..? అసలు ఈ మూడు పార్టీల మధ్య ఏం జరుగుతోంది..? దీని వెనుకున్న కారణాలేంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
వైఎస్ జగన్ సవాళ్లు చెక్కిన శిల్పం. పిట్టకంటి మీద గురి పెట్టిన అర్జునిడిలా, బెసకని సంకల్పానికి ప్రతినిధి సంకల్పమే సగం బలంగా సాగుతున్న ధీరుడు. తీక్షణ ఆలోచన.. తీర్చిదిద్దిన నాయకత్వం వైఎస్ జగన్ సొంతం. మాటలో నిలకడ, చేతలో దూకుడు, అదిలించకుండానే కదిలించగల నేర్పు, కాలగమనం లాంటి కఠిన మార్పును కూడా తట్టుకోగల నేర్పు వైఎస్ జగన్‌ను నేతగానే కాదు నిర్ణేతగాను మలిచాయి.
అందుకే ప్రజల అభిమానం పొందిన వారిలో జగన్‌ను బీట్ చేసే కెపాసిటీ లేదిక్కడ. సిన్సియారిటీతో నేలను తాకాలన్నా చినుకు చూపించే సంకల్ప బలంతో అడుగేసే నాయకులు మనముందు కనిపిస్తారు. పల్లమొచ్చినప్పుడే ఎత్తు కనిపించినట్టు.. పతనమవుతున్న అథములు కనిపించినపపుడే మహోన్నతమైన మనిషి విలువ కూడా అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే శిఖరం చేసే సింహనాధం వైఎస్ జగన్ ఈ మాటలు అంటుంది ఎవరో కాదండి ప్రజలే. చంద్రబాబు, పవన్‌లతోనూ మైండ్ గేమ్ ఆడటంలో జగన్ రాటుదేలాడని వారే అంటున్నారు. మరి ప్రజలు ఏమీ ఆలోచించకుండా అనరు కదా..?