Home / 18+ / వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలోనే అధికార పార్టీ సహా ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాయి.

మరోపక్క ఎన్నికల సర్వే ఏజెన్సీలు సైతం రంగంలోకి దిగాయి. ఏపీలోని ప్రతీ ప్రాంతాన్ని కలియ తిరిగి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. 2019 రాజకీయ పార్టీల భవిష్యత్‌ను తేల్చే పనిలో పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ సర్వే స్థాయిలో పేరుగాంచిన సర్వేలన్నీ అందులో భాగమే. అయితే, రిపబ్లికన్ టీవీ సర్వే, ఆర్ఎస్ఎస్ సర్వే, రాహుల్ గాంధీ సర్వే, ఎన్డీ టీవీ సర్వే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక సంస్థ సర్వే, ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వేల ఫలితాలు గతంలో వెలువడిన విషయం తెలిసిందే. అయితే, పై సర్వేలన్నీ కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో పలు సీనియర్ పార్టీల రాజకీయ నేతలు ఇప్పటికే వైసీపీలో చేరగా.. మరికొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో, తూర్పుగోదావ‌రి జిల్లాలో బ‌ఢా పారిశ్రామిక వేత్త, చేబ్రోలు ఆద‌ర్శ్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల చైర్మ‌న్ బుర్రా అనుబాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా, ఆదివారం మ‌ధ్యాహ్నం పిఠాపురం ప‌ట్ట‌ణ ప‌రిధిలోగ‌ల పాత బ‌స్టాండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫంక్ష‌న్ హాలులో మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీలో చేరుతున్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం సాయంత్రం పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాగే, వైఎస్ జ‌గ‌న్ ఎవ‌రికి టిక్కెట్ కేటాయించినా..పార్టీ గెలుపే ల‌క్ష్యం ప‌నిచేస్తాన‌ని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat