క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న భూతం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు నోరు విప్పగా. తాజాగా మరో హీరోయిన్ స్పందించింది. ఆమెనె పూజా కుమార్. విశ్వరూపమ్, ఉత్తమ విలన్, పీఎస్‌వీ గరుడవేగ వంటి వైవిధ్యాత్మిక చిత్రాల్లో నటించి అటు నటన పరంగాను.. ఇటు గ్లామర్‌పరంగాను మంచి మార్కులు కొట్టేసింది పూజా కుమార్. తనకు ఇంత వరకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురు కాలేదని, అయితే, ఈ విషయంపై గళమెత్తడం చాలా ముఖ్యమని చెప్పింది.
కాగా, ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా కుమార్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త అమ్మాయిలను, హిట్ కోసం స్ర్టగుల్ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, మూవీ మేకర్స్ పట్టి పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ సినీ ఇండస్ట్రీకి సరదాల కోసం సుఖాలు అనుభవించడం కోసం వస్తారు. తమ సుఖాల కోసం స్టార్ హీరోయిన్లను కూడా వీరు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్ట్‌లను కొందరు ఫిల్మ్ మేకర్స్ సినిమాలో నటించే అవకాశాల నుంచి తప్పిస్తున్నారు అని బోల్డ్‌గా చెప్పేసింది ఈ బ్యూటీ.
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది వేరెవరికీ జరగకుండా చేయాలని చెప్పింది. హీరోయిన్లు ఎవరూ కూడా ఇలాంటి డిమాండ్స్‌కు ఒప్పుకోనవసరం లేదని, హార్డ్‌వర్క్‌తో కెరీర్‌తో విజయం సాధించవచ్చని, లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది. ఎవరైతే కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారు తమకు ఎదురైన ఇబ్బందులను బయటకు చెప్పాలని, దీని వల్ల సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో సొసైటీకి తెలుస్తుందని, ఇండస్ట్రీకి కూడా పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం లభిస్తుందని చెప్పింది.