ఇంకొక్కసారి రౌడీ కావాలి, బన్నీగారు కావాలి అని అరిస్తే యాసిడ్ పోసేస్తా. అందరూ అరవడం ఆపండి అంటూ కన్నడ భామ రష్మిక మందన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు, వియదేవరకొండ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మీక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే, రష్మిక తాజాగా నటించిన గీత గోవిందం చిత్రం ఆదివారం సాయంత్రం ఆడియో వేడుక జరుపుకున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో గీత గోవిందం చిద్రం హీరో హీరోయిన్లతోపాటు చిత్ర బృందం పాల్గొంది. ముఖ్య అతిధిగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇదే సందర్భగా రష్మీక ఆడియో కార్యక్రమం వేదికపై మాట్లాడుతున్న క్రమంలో రష్మీక మాట్లాడుతుండగా ఒక్కసారిగా అరుపులు వినపడ్డాయి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మాట్లాడాలంటూ ఫ్యాన్స్ అరవడం మొదలు పెట్టారు. దీంతో విసుగెత్తిన రష్మిక ఇంకొక్కసారి రౌడీ కావాలి..బన్నీకావాలి అని అరిస్తే అందరిపై యాసిడ్ పోసేస్తానంటూ చిత్రంలోని తన డైలాగ్‌ను రివీల్ చేసింది.