Home / POLITICS / నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!

నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు ఈ రోజు జరిగిన నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సైనికుల సమావేశానికి హజరయ్యారు..ఈ సమావేశంలో పాల్గోన్న పదహారు వందల మందికి తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏళ్ళుగా సోషల్ మీడియా పోలిటికల్ క్యాంపైన్ రంగంలో రాణిస్తున్న కరణ్ కాన్సెప్ట్స్ కంపెనీ సోషల్ మీడియాలో ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఎలా ప్రచారం చేయాలి..సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లతో పాటు క్షేత్రస్థాయిలోని ప్రజలకు ఎలా చేరవేయాలి ..ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వం మీద ,అటు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికోట్టాలి..రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా సైనికులుగా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి,ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి గెలుపుకోసం ఎలా పని చేయాలి తదితర అంశాల గురించి కరణ్ కాన్సెప్ట్స్ ఎండీ చెరుకు కరణ్ రెడ్డి గారి నేతృత్వంలోని బృందం శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారు నాయకత్వం వహించగా ..టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎంతో విజయవంతమైంది.

శిక్షణానంతరం ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి పిలుపుమేరకు స్వచ్చందంగా టీఆర్ఎస్ పార్టీ కోసం..నాకు ,ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి ముందుకొచ్చిన పదహారు వందల మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..గత నాలుగేళ్ళుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి..నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను..రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా పదహారు వందల మంది స్వచ్చందంగా పనిచేయడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని..వారికి ప్రతిక్షణం అండగా ఉంటానని..అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సీఎం కేసీఆర్ గారికి పట్టం కట్టే విధంగా పనిచేయాలని ఆయన కోరారు.. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు కరణ్ కాన్సెప్ట్స్ కంపెనీ ఎండీ చెరుకు కరణ్ రెడ్డి గారికి ,మొదటి నుండి నాకు అన్నివిధాలుగా తోడుగా ఉంటూ..నాకు ప్రజలకు మధ్య మంచి వారధిగా పనిచేస్తూ ..ఈ కార్యక్రమం విజయవంతమవ్వడానికి ఎంతో కృషి చేసిన జక్కా రఘునందన్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు..కార్యక్రమం అనంతరం శిక్షణ సమావేశానికి హజరైన సోషల్ మీడియా సైనికులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి కోసం స్వచ్చందంగా పనిచేయడానికి ముందుకొచ్చాం..ఈ కార్యక్రమంలో కరణ్ కాన్సెప్ట్స్ బృందం చెప్పిన పలు విషయాలు,మెలుకువలు మాకెంతో ఉపయోగపడనున్నాయి..మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్ది గారి నాయకత్వంలో నిర్వహించిన జక్కా రఘునందన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..రానున్న కాలంలో ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న పలు విషయాలతో ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసి..ఎమ్మెల్యే గారిని బంపర్ మెజార్టీతో గెలిపించి మరోసారి అసెంబ్లీకి పంపి నాగర్ కర్నూల్ అంటే మర్రి జనార్థన్ రెడ్డి ..మర్రి జనార్థన్ రెడ్ది అంటే నాగర్ కర్నూల్ అని అనుకునేలా పనిచేస్తామని అన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat